: మందేసి చిందేస్తూ, బీభత్సం సృష్టించిన పోలీసులు


అసలే పోలీసులు, పైగా పీకల్దాకా తాగారు. ఆపై చేతిలో కారుంది. ఇంకేం, రోడ్లపై చిందులు వేస్తూ, దూసుకెళ్లారు. అదుపుతప్పి రోడ్ల పక్కన నిలిపివుంచిన వాహనాలపైకి కారును దూకించారు. ఒక్కో వాహనాన్ని ఢీకొట్టుకుంటూ ముందుకు సాగిపోయారు. పలు వాహనాలు ధ్వంసమవుతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మణుగూరులో శనివారం అర్ధరాత్రి జరిగింది. తమ ఇష్టానుసారం కారు నడుపుతూ వాహనాలను ధ్వంసం చేసిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వారు రోడ్లుపై కనీసం నిలబడలేని స్థితిలో ఉండటం గమనార్హం. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వచ్చి వారిని తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా కేసు నమోదు చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News