: ఆ కసే నాతో దొంగతనం చేయించింది: 'హార్లీ డేవిడ్ సన్' బైక్ దొంగ కిరణ్


"ఖరీదైన హార్లీ డేవిడ్ సన్ లగ్జరీ బైకు నడపాలన్నది నా చిరకాల కల. డబ్బివ్వాలని కోరితే తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ కసితోనే బైకును దొంగిలించాను. బైకును నడిపి తీరాలన్న కోరికతోనే ఈ పని చేశాను" అని హైదరాబాదులో హార్లీ డేవిడ్ సన్ షోరూము నుంచి ట్రయల్ చూస్తానంటూ, బైకును దొంగిలించుకు పోయిన తుర్లపాటి కిరణ్ అన్నాడు. సైనికపురికి చెందిన ఓఎన్ జీసీ ఉద్యోగి కిరణ్ ఈ నెల 1న రూ. 6 లక్షల విలువైన బైకును అపహరించిన విషయం విదితమే. ముంబైలో బైకును విక్రయిస్తున్న కిరణ్ ను పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. తాను సముద్ర జలాల్లో 15 రోజుల పాటు రేయింబవళ్లు పని చేస్తానని, అందువల్ల మానసికంగా అనారోగ్యం పాలవుతున్నానని కూడా కిరణ్ చెప్పాడని పోలీసులు వివరించారు. బైకును స్వాధీనం చేసుకున్నామని, కిరణ్ ను కోర్టు ముందు హాజరు పరచనున్నామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News