: చిన్నారి అయిలాన్ కుర్దీ ఆఖరి మాటలివే!
అయిలాన్ కుర్దీ... సిరియా నుంచి యూరప్ చేరుకోవాలన్న ఏకైక లక్ష్యంతో సముద్రంలో బయలుదేరిన కుటుంబంలోని మూడేళ్ల చిన్నారి. బోటు మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయి, విగత జీవుడిగా టర్కీ తీరానికి చేరి కోట్లాది మంది మనసులను కరిగించాడు. శరణార్థుల పట్ల యూరప్ వైఖరి మారేలా చేశాడు. బోటు మునిగిపోయిన సమయంలో తన తండ్రి చేతుల్లో ఉన్న అయిలాన్ ఆఖరుగా అన్న మాటలు... "డాడీ, ప్లీజ్ డోంట్ డై" (నాన్నా, దయచేసి మరణించొద్దు) ఇదే అయిలాన్ ఊపిరి పోయేముందు చెప్పిన మాట. ఈ విషయాన్ని అయిలాన్ ఆంటీ మీడియాకు వివరించారు. "పడవ మునిగిపోగా, అందరూ నీటిలో పడిపోయారు. అయిలాన్ తండ్రి తన ఇద్దరు కొడుకులనూ చెరోచేత్తో పట్టుకుని నీటి పైన తల ఉండేలా చూడాలని ప్రయత్నించారు. కానీ బలమైన అలలు సహకరించలేదు. తన శక్తినంతా ఉపయోగించినా బిడ్డల ప్రాణాలు దక్కలేదు" అని విలపిస్తూ చెప్పారు.