: 286 మందికి వీఐపీ భద్రత: కేంద్ర హోం శాఖ


బెదిరింపులు, ఇతర కారణాలతో మొత్తం 286 మందికి భారత ప్రభుత్వం వీఐపీ కేటగిరీ కింద ప్రత్యేక భద్రత కల్పించింది. 2015 వరకు 286 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించిందని కేంద్ర హోం శాఖ తెలిపింది. 'జడ్ ప్లస్' కేటగిరీ కింద 33 మందికి ప్రత్యేక భద్రత కల్పించగా, 'జడ్' కేటగిరీ కింద 76 మందికి భద్రత కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. 'వై' కేటగిరీ కింద 141 మందికి ప్రత్యేక భద్రత కల్పించామని కేంద్ర హోం శాఖ చెప్పింది. 'ఎక్స్' కేటగిరీ కింది 36 మందికి భద్రత కల్పించినట్టు తెలిపింది. మొత్తంగా 286 మందికి వీఐపీ భద్రత కల్పించినట్టు కేంద్ర హోం శాఖ వివరించింది.

  • Loading...

More Telugu News