: పంజాగుట్టలో సందడి చేసిన నాగార్జున
టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హైదరాబాదులోని పంజాగుట్టలో సందడి చేశాడు. నగల దుకాణం నూతన బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా నాగార్జున రావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. నాగార్జున వస్తాడని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో నాగార్జున సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా కొంత మంది అభిమానులు సెల్ఫీలు అడగడంతో నవ్వుతూ వారి కోరిక మన్నించాడు. తమ 'మన్మథుడు'తో ఫోటోలు దిగడంతో అభిమానులు సంబరపడిపోయారు.