: బాలీవుడ్ బాద్షా షారూఖ్ గురువులెవరో తెలుసా?


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గురువులెవరో తెలుసా? ఇంకెవరు, అయన పిల్లలేనట! వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమని షారూఖ్ చెబుతున్నాడు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో షారూఖ్ తన గురువులు తన పిల్లలేనని చెప్పాడు. ఓర్పు, సౌమ్యత, సహనశీలత, నిర్మలమైన ప్రేమ, నిష్కళంకమైన నవ్వు తన పిల్లల నుంచి నేర్చుకుంటున్నానని షారూఖ్ తెలిపాడు. కాగా, షారూఖ్ కు ముగ్గురు పిల్లలన్న విషయం తెలిసిందే!

  • Loading...

More Telugu News