: గురుపూజోత్సవం సందర్భంగా స్ఫూర్తి రగిలించిన సచిన్


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడన్న సంగతి విదితమే. ఈ రోజు గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సచిన్ దేశంలోని విద్యార్థులందర్లో స్ఫూర్తి రగిలించాడు. టీచర్స్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్లో తన చిన్ననాటి గురువు ఆచ్రేకర్ తనను సరిచేస్తున్న ఫోటోను పెట్టిన ఆయన ఆ ఫోటోపై అద్భుతమైన వ్యాఖ్యను జత చేశాడు. "నీ ఆలోచనలను ప్రేరేపించి, నీ ప్రతిభను గుర్తించి, దానికి పదును పెట్టి, నిన్ను సరైన మార్గంలో నడిపించేది గురువే... గురువు అవసరమైనప్పుడు సత్యమనే బెత్తంతో శిక్షిస్తాడు...గురుపూజోత్సవ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News