: ఆసియన్ షూటింగ్ లో గగన్ నారంగ్ కు టాప్ ర్యాంక్
ఆసియన్ షూటింగ్ ర్యాంకింగ్స్ లో ఒలింపిక్ మెడలిస్ట్, షూటర్ గగన్ నారంగ్ మొదటి ర్యాంకు సాధించాడు. 50 మీటర్ల రైఫిల్ విభాగంలో 971 పాయింట్లతో నారంగ్ కు ఈ తొలి ర్యాంకు దక్కింది, 896 పాయింట్లతో చైనా క్రీడాకారుడు షెంగ్బో జో రెండో స్ధానంలో నిలిచాడు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా 5వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఈ విభాగంలో నారంగ్ ఏడవ ర్యాంక్ లో ఉన్నాడు.