: రూ.1300 కోట్లతో ఈ-ప్రగతి ప్రాజెక్టు: చంద్రబాబు
ఈ రోజు జరిగిన మంత్రివర్గంలో ఈ-ప్రగతి ప్రాజెక్టుపై తీసుకున్న నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు మీడియాకు తెలిపారు. రూ.1300 కోట్లతో ఈ-ప్రగతి ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ప్రజలకు అందే సేవలను సరళం చేసేందుకే ఈ-ప్రగతి ఉపయోగపడుతుందన్నారు. దానిలో 77 శాఖల ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని, ఈ ప్రాజెక్టును పీపీపీ మోడల్ లో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఏపీ, సింగపూర్ ప్రభుత్వం, విప్రో కంపెనీ సంయుక్తంగా ఈ-ప్రగతిని నిర్వహిస్తాయని సీఎం వివరించారు.