: పద్మావతి వర్శిటీలో 85 శాతం సీట్లు స్థానికులకే కేటాయించాలి: రఘువీరా


తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో 85 శాతం సీట్లు స్థానికులకే కేటాయించాలని ఏపీసీసీ అద్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. ఈ వర్శిటీ అడ్మిషన్లపై ఇచ్చిన జీవో 120ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే మెడికల్ సీట్లు కేటాయించాలని కోరారు. హైకోర్టు కొట్టివేసిన ఈ జీవోపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలును కూడా విరమించుకోవాలని రఘువీరా విజ్ఞప్తి చేశారు. జోనల్ వ్యవస్థను ఉల్లంఘించే నిర్ణయాలు సరైనవి కావన్నారు. దానివల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కాల్సిన మెడికల్ సీట్లు మిగతా జిల్లాలకు దక్కడం బాధాకరమని అన్నారు. అంతేగాక 13 జిల్లాలను లోకల్ గా పరిగణిస్తే రాయలసీమకు నష్టమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News