: తిరుపతి ఎస్వీయూ ఎదుట రాయలసీమ పోరాట సమితి నేతల ఆందోళన


తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎదుట రాయలసీమ పోరాట సమితి నేతలు ఆందోళన నిర్వహించారు. నీరు, నిధులు, హక్కుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తారు. ఈ ఆందోళనలో పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆందోళన సమయంలో ఎస్వీ యూనివర్శిటీలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి మెడికల్ కాలేజీ కౌన్సిలింగ్ లో నిబంధనలు పాటించలేదని, రాయలసీమ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9న సీమ సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News