: హైదరాబాద్ కు పాకిన సిరంజి దాడి... నాలుగో తరగతి విద్యార్థినికి సూది గుచ్చిన దుండగుడు
ఏపీలో నిన్నటివరకు కలకలం సృష్టిస్తున్న సిరంజి దాడి తాజాగా హైదరాబాద్ కు పాకింది. నగరంలోని మల్కాజ్ గిరిలో రమ్య అనే నాలుగవ తరగతి విద్యార్థిని స్కూల్ కు వెళుతుండగా దుండగుడు దాడి చేశాడు. చిన్నారికి సూది గుచ్చి పరారయ్యాడని తెలిసింది. వెంటనే ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో సిరంజి దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు.