: ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చలు రాజ్యాంగ విరుద్ధం కాదు: వెంకయ్యనాయుడు


తాజాగా జరిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీ సమావేశాలపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చలపై అభ్యంతరాలెందుకుని, అది రాజ్యాంగ విరుద్ధం కాదణి అన్నారు. స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన సంస్ధ అని పేర్కొన్నారు. బీజేపీ, ఎన్డీఏ ఎజెండా ప్రకారమే పరిపాలన జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో టెన్ జన్ పథ్ (సోనియాగాంధీ నివాసం) నుంచే నిర్ణయాలు జరిగేవని వెంకయ్య ఎద్దేవా చేశారు. ఇక బీహార్ కు ప్రధాని అత్యంత గరిష్ఠమైన ప్యాకేజీ ఇచ్చారన్నారు. మాజీ సైనికుల వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పై రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ కు సూచించారు. దేశ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News