: తెలంగాణకు కొత్తగా రూ.1,046 కోట్ల పెట్టుబడులు... 16 పరిశ్రమలకు అనుమతులిచ్చిన ప్రభుత్వం


కొత్త రాష్ట్రం తెలంగాణలో మరో 16 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నిన్న నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) కింద రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయా కంపెనీల యాజమాన్యాలకు అనుమతి పత్రాలు జారీ చేశారు. దాదాపు రూ.1,046 కోట్ల విలువతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమల ద్వారా 2,988 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే రెండు దఫాలుగా ఆయా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో విడత అనుమతులను జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఎలాంటి ఆలస్యం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మూడో విడత కింద అనుమతులు లభించిన ఫ్యాక్టరీల్లో సోలార్, ఆటోమోబైల్, ఫార్మా, ట్యూబ్స్ అండ్ టైర్స్ కర్మాగారాలున్నాయి.

  • Loading...

More Telugu News