: వెంకన్న సేవలో ఏపీ డీజీపీ... ‘ఎర్ర’ స్మగ్లర్ గంగిరెడ్డిని రప్పిస్తామని ప్రకటన


ఏపీ డీజీపీ జేవీ రాముడు రెండు రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేటి తెల్లవారుజామున తిరుమల వెళ్లిన ఆయన ప్రారంభ సేవల్లోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్మగ్లర్లను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. మారిషస్ పోలీసులకు పట్టుబడ్డ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రాష్ట్రానికి రప్పించి తీరతామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే మారిషస్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News