: బెంగళూరు ఎయిర్ పోర్టుకూ బాంబు బెదిరింపు... సౌత్ బెంగళూరు నుంచే ఫోన్ కాల్?


బాంబు బెదిరింపులకు సంబంధించి వచ్చిన ఫోన్ కాల్స్ తో అటు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, ఇటు బెంగళూరు ఎయిర్ పోర్టులోనూ కలకలం రేగింది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తే బెంగళూరు ఎయిర్ పోర్టుకూ ఫోన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు విమానాలను వెనక్కి రప్పించిన అధికారులు ముమ్మర సోదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రెండు ఎయిర్ పోర్టులకు కూడా సౌత్ బెంగళూరు ప్రాంతం నుంచే ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారించుకున్నారు. నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు వేట ప్రారంభించారు.

  • Loading...

More Telugu News