: పాలమూరు దాడిపై టీ సీఎల్పీ అత్యవసర భేటీ... గవర్నర్ ను కలిసే అవకాశం
మహబూబ్ నగర్ లో నిన్న జరిగిన పాలమూరు జడ్పీ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేసిన ఘటనను టీ సీఎల్పీ సీరియస్ గా తీసుకుంది. నేటి ఉదయం సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అత్యవసరంగా భేటీ కానున్నారు. గువ్వల బాలరాజు చేసిన దాడిపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ భేటీలో నిర్ణయించుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ విషయంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూ ఫిర్యాదు చేయాలని సీఎల్పీ నేతలు భావిస్తున్నారు. భేటీ అనంతరం వారంతా రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసే అవకాశాలున్నాయి.