: పాలమూరులో బంద్ ప్రారంభం... బస్సులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటి తెల్లవారుజామునే బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ బంద్ చేస్తున్నారు. ఆయా ఆర్టీసీ డిపోల వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో తెల్లవారకముందే రోడ్లపైకి వచ్చిన నేతలు, ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. బాల్ రాజు దాడి అధికార పార్టీ దురంహకారానికి నిదర్శనమేనని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.