: మూడు వారాలుగా ఇంట్లో భర్త శవంతో భార్య!


మూడు వారాలుగా భర్త మృతదేహంతో గడిపిన భార్య ఉదంతం న్యూజిలాండ్ లో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ దంపతులు గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ లో నివాసముంటున్నారు. కొన్ని వారాలుగా వాళ్లిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. దీంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. అయితే, వారం క్రితం ఆ ఇంట్లో నుంచి భార్య బయటకు రావడాన్ని ఇరుగు పొరుగు వారు గమనించారు. వారు నివాసముంటున్న ఇంటి నుంచి దుర్గంధం రావడంతో ఈ విషయమై స్థానికులు ఆమెను ప్రశ్నించగా, ఎలుక చచ్చిపోయిందని ఒకసారి, ఆహారం పాడైందని మరోసారి చెప్పింది. ఇంట్లో నుంచి దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు కూడా చల్లింది. అయినప్పటికీ అవి పని చేయలేదు. దుర్వాసన హోరెత్తిపోయింది. దీంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో భర్త శవం ఉండడంతో వెంటనే శవాన్ని బయటకు తీసుకువెళ్లాలని చెప్పినా ఆమె వినకపోవడంతో, ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News