: తండ్రికి తగ్గ తనయుడు ...ద్రావిడ్ ను మరిపించిన కుమారుడు
టీమిండియా వాల్ రాహుల్ ద్రావిడ్ ను అభిమానించని క్రికెట్ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. రాహుల్ ద్రావిడ్ క్రీజులో ఉన్నాడంటే టీమిండియా పరువు నిలుపుకుంటుందన్న మినిమం గ్యారెంటీ అభిమానుల్లో వ్యక్తమయ్యేది. బ్యాటింగ్ త్రయంలో ఒకరిగా వెలుగొందిన ద్రావిడ్ అసాధారణమైన ఆటతీరు కనబరిచేవాడు. గంగూలీ, సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్ వంటి వారందరి మధ్య తన ప్రత్యేకత చాటుకున్నాడు. అలాంటి ద్రావిడ్ కు వారసులంటూ పుజారా, రహానేల పేర్లు వినిపించాయి. అయితే అసలైన వారసుడైన ఆయన తనయుడు మాత్రం బెంగళూరు అండర్ 12 పోటీల్లో సత్తాచాటాడు. తండ్రి ఆటతీరును గుర్తు చేసిన సమిత్, తన స్కూల్ తరపున 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అంతకు ముందు 77 పరుగులు చేసి ఈ టోర్నీలో తన జట్టు పాల్గొనేందుకు కారణమయ్యాడు. సమిత్ ఆడిన మ్యాచ్ ను రాహుల్ ద్రావిడ్ కూడా వీక్షించడం విశేషం. కుమారుడి ఆటలో లోపాల్ని సరిచేస్తూ ద్రావిడ్ కనిపించాడు. మ్యాచ్ వీక్షకులు తండ్రికి తగ్గ తనయుడంటూ సమిత్ కు కితాబులిచ్చారు.