: భద్రతా వలయంలో బుద్ధగయ...రేపు ప్రధాని పర్యటన


ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లోని బుద్ధ గయకు రేపు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుద్ధగయ పూర్తి స్థాయి భద్రతా వలయంలో ఉంది. ఢిల్లీలో రెండు రోజుల క్రితం అంతర్జాతీయ బౌద్ధుల సమావేశం ప్రారంభమైంది. దీని ముగింపు సమావేశం బుద్ధ గయలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని హాజరుకావాల్సి ఉంది. ప్రత్యేక రక్షణ దళం( ఎస్పీజీ)కు చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బుద్ధగయ ఆలయ నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎన్. దోర్జి మాట్లాడుతూ ఆలయ పరిసరాలలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారని, 90 దేశాలకు చెందిన డెలిగేషన్ ప్రతినిధులు పాల్గొననున్నారని అన్నారు. గయ ఎయిర్ పోర్ట్ వద్ద మోదీకి అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబోజాంగ్, మహాబోధి ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు భాంటి ఛాలిందా స్వాగతం పలుకుతారని దోర్జి చెప్పారు.

  • Loading...

More Telugu News