: సెల్ఫీల పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే... ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు!


యువత సోషల్ మీడియాకు అతుక్కుపోతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ లైకులు, కామెంట్లు, షేర్లు చూసుకుని మురిసిపోతున్నారు. ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా (23) సెల్ఫీలలో అందంగా కన్పించేందుకు 80 వేల రూపాయలు ఖర్చు చేసి, పెదవులు, ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ప్లాస్టిక్ సర్జరీతో పెరిగిన అందాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు. తన ఇన్ స్టా గ్రాంలో 500 మంది ఫాలోవర్లు ఉన్నారని, వారిని ఆకట్టుకునేందుకు ఇప్పుడున్న అందం సరిపోతుందని సాహిల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇకపై సెల్ఫీలలో అందంగా కనిపిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్లాస్టిక్ సర్జరీ తరువాత ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాంలో ఫాలోవర్లు పెరిగారని సాహిల్ చెప్పగా, అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ అనుదీప్ ధీర్ మాట్లాడుతూ, సెల్పీలు తనవద్దకు కస్టమర్లను తీసుకొస్తున్నాయని అన్నారు. గత రెండేళ్లలో 25 శాతం మంది కస్టమర్లు పెరిగారని, అందంగా కనపడేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News