: అమరావతి ప్యాకేజీ తరహాలోనే మచిలీపట్నం పోర్టు ప్రాంత రైతులకూ ఇస్తాం: చంద్రబాబు


మచిలీపట్నం పోర్టు ప్రాంత రైతులు భూసేకరణపై ఆందోళనకు గురికావద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి ప్యాకేజీ తరహాలోనే వారికీ ఇస్తామని ప్రకటించారు. రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలను తమ ప్రభుత్వం తీసుకోదని హామీ ఇచ్చారు. ఈరోజు ఏపీ శాసనసభలోని సీఎం ఛాంబర్ లో చంద్రబాబును మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ కలసి రైతుల ఆందోళనపై వివరించారు. అందుకు స్పందించిన సీఎం, మచిలీపట్నం పోర్టు సిటీని మెగా ఇండస్ట్రియల్ సిటీగా మార్చాలన్న పట్టుదలతో ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News