: చాలా చోట్ల విద్యుత్తే ఉండదు...డిజిటల్ ఇండియా ఎలా సాధిస్తారు?: మోదీకి బుడతడి సూటి ప్రశ్న
'టీచర్స్ డే'ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ బాలుడు ప్రధానికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న సంధించాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తే ఉండదు... అలాంటప్పుడు డిజిటల్ ఇండియా ఎలా సాధిస్తారని అడిగాడు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ, 2022 కల్లా భారతదేశం మొత్తం నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. మన దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేదని, 1000 రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తామని ఆయన చెప్పారు. ప్రధానితో జరిగిన చర్చలో 9 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొనడం విశేషం.