: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్


అసెంబ్లీ సమావేశాలను నిర్వహించిన తీరు పట్ల వైకాపా అధినేత జగన్ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై కనీసం 15 రోజులు చర్చిద్దామని కోరినా... సమావేశాలను 5 రోజులకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుపై చర్చించేందుకు కూడా టీడీపీ నేతలు భయపడ్డారని విమర్శించారు. పట్టిసీమలో వాటర్ స్టోరేజ్ లేదని, అందుకే ఆ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు రిక్రూట్ మెంట్ క్యాలెండర్ ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News