: కుర్తా రహస్యం చెప్పిన ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ తాను ధరించే కుర్తా రహస్యాన్ని బయటపెట్టారు. దుస్తుల విషయంలో తనకు ఎవరూ ప్రత్యేక డిజైనర్ లేరని చెప్పారు. మొదటి నుంచీ ఈ తరహా దుస్తులే ధరించడం తనకు అలవాటన్నారు. అసలు, మోదీ తన కుర్తా గురించి మాట్లాడాల్సిన అవసరమెందుకొచ్చిందంటే... శుక్రవారం నాడు పాఠశాల విద్యార్థులతో ప్రధాని సంభాషిస్తున్న సందర్భంలో మోదీ దుస్తులు భారత సంప్రదాయానికి అద్దం పడతాయంటూ విద్యార్థులు కితాబిచ్చారు. దీంతో మోదీ తన కుర్తా కథ చెప్పి విద్యార్థులను ఆనందింపజేశారు. గుజరాత్ లో చలి తక్కువగా ఉండటం, సాదాసీదాగా ఉండాలనే తన ఆలోచన, ఉతకడానికి ఎక్కువ సమయం పట్టకపోవడం వల్ల సమయం ఆదా అవడం వంటి కారణాలతోనే తాను కుర్తా ధరిస్తానని విద్యార్థులకు మోదీ వివరించి చెప్పారు. ధరించే దుస్తులు శుభ్రంగా ఉండాలి, బాగా కనిపించాలని తాను కోరుకుంటానని అన్నారు. అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చిన్న కుండలో నిప్పులు వేసి ఇస్ర్తీ చేసుకునేవాడినని, కాన్వాస్ షూ వేసుకునే వాడినని మోదీ తన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News