: ముగ్గురు భర్తల మధ్య ఇంద్రాణి... నేడు పూర్తి మిస్టరీని మీడియాకు వివరించనున్న ముంబై పోలీసులు!


ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్... ఇండియాలో సంచలనం సృష్టించిన ఓ హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీలో ఉన్న చిక్కుముడులను నేడు విప్పనుంది. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను, ఆమె ముగ్గురు భర్తల మధ్య కూర్చోబెట్టి, నేటి ఉదయం నుంచి పోలీసు అధికారులు విచారిస్తున్నారు. సిద్ధార్థరాయ్, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియాలతో పాటు రెండో భర్తతో ఇంద్రాణి కన్న విధిని సైతం కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే హత్యను ఓ కొలిక్కి తెచ్చిన పోలీసులు, ఇంద్రాణి మొత్తం కుటుంబాన్ని ఒకచోట చేర్చి ప్రశ్నించడం ద్వారా తమకున్న చివరి అనుమానాలను తీర్చుకుని, పూర్తి హత్యోదంతాన్ని నేడు మీడియా ముందు పెట్టనున్నారని తెలుస్తోంది. కాగా, ఈ ఉదయం తన కుమార్తె విధిని చూడగానే ఇంద్రాణి భోరున విలపించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తున్నప్పటికీ, పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

  • Loading...

More Telugu News