: టర్కీకి అండగా నిలుస్తామన్న ఫ్రాన్స్
కాందిశీకుల అంశంలో టర్కీకి అండగా ఉంటామని ఫ్రాన్స్ తెలిపింది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. సిరియా శరణార్థులు 12 మంది టర్కీ నుంచి గ్రీస్ వెళుతూ సముద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో, ఈ రెండు దేశాధినేతలు ఫోన్ ద్వారా సంప్రదించుకున్నారు. ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాఛ్యం నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు యూరప్ కు వలసలు పోతున్నారు. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దురాగతాలతో వలసలు ఊపందుకున్నాయి. ఈ వలసలతో పలు యూరప్ దేశాలు పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నాయి. ఈ కాందిశీకుల సమస్యను అన్ని దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు కలసి పరిష్కరించాలనే అంశాన్ని ఇరు దేశాధినేతలు అంగీకరించారు.