: దేవుడయినా వదిలేస్తాడేమో కానీ, రహానే మాత్రం క్యాచ్ వదలడు!: ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్


రహానే ఫీల్డింగ్ పై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా ఫీల్డింగ్ పై ఎన్నో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో జోకులు ప్రచారంలో ఉన్నాయి. టీమిండియాను పటిష్ఠపరిచే చర్యల్లో భాగంగా ఫీల్డింగ్ పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. దీంతో ఆర్.శ్రీధర్ ను ఫీల్డింగ్ కోచ్ గా నియమించింది. దీంతో తాజా పర్యటనలో దాని ఫలితాలు కనిపించాయి. రహానే అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తాడని పేర్కొన్న శ్రీధర్, దేవుడయినా క్యాచ్ వదులుతాడేమో కానీ రహానే మాత్రం క్యాచ్ వదలడని పేర్కొన్నారు. రెండో టెస్టులో సంగక్కర తొలుత ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ ను జారవిడిచిన రహనే మరో ఆరు ఓవర్ల తరువాత అంతకంటే క్లిష్టమైన క్యాచ్ ను డైవ్ చేస్తూ ఒంటి చేత్తో పట్టాడని ఆయన గుర్తు చేశారు. ఫీల్డింగ్ ప్రాముఖ్యతను ఆటగాళ్లు కూడా గుర్తించారని, అందుకే అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News