: తెలంగాణలో ఉద్యమం అయిపోయింది... లూటీ మొదలైంది: బీజేపీ నేత యెన్నం
బీజేపీ నేత యెన్నం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉద్యమం అయిపోయిందని... ఇక లూటీ మొదలైందని విమర్శించారు. అంతేగాక అస్తవ్యస్త పాలన కూడా ప్రారంభమైందని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రభుత్వ అవినీతి కూడా బట్టబయలవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని యెన్నం ఆరోపించారు.