: గుడుంబాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తాం: టీఆర్ఎస్


గుడుంబా వాడకంతో పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. అందువల్లే గుడుంబాను మాన్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, గుడుంబా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గిరిజనుల బతుకులు బాగుపడకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో గుడుంబా వల్ల గిరిజనులు తమ ఆడపిల్లలను అమ్ముకున్న ఉదంతాలు చాలా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా, గిరిజనులపై భారీ సంఖ్యలో ఆబ్కారీ కేసులు ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News