: గుడుంబా తాగించి ప్రజల జీవితాలను నాశనం చేసింది మీరు కాదా?: కర్నె ప్రభాకర్


కాంగ్రెస్, టీడీపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఆబ్కారీ విధానాలతో జనాలకు గుడుంబా తాగించి, వారి జీవితాలను నాశనం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీల పెంపును ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమాల గురించి టీడీపీ నేతలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పారు. విపక్ష నేతలు విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News