: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ... రాజధాని నిర్మాణంపైనే ప్రధాన చర్చ


ఏపీ కేబినెట్ రేపు భేటీ కానుంది. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఈ భేటీలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన రైతులను భూ సమీకరణ దిశగా ఒప్పించే పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే, రైతు రుణమాఫీకి సంబంధించి విజయ యాత్రల నిర్వహణపైనా రేపటి కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News