: ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా కేవీపీపై చర్యలు: స్పీకర్ కోడెల ప్రకటన


ఏసీ శాసనసభ, సభాధ్యక్ష స్ధానాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. అసెంబ్లీ లాంజ్ లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూనే, వైఎస్ ఫొటోను తిరిగి యథాస్థానంలో పెట్టాలని కోరుతూ కేవీపీ ఇటీవల స్పీకర్ కు ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో అసెంబ్లీతో పాటు స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యానించారని టీడీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేవీపీపై టీడీపీ సభ్యురాలు అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల, నోటీసును ఎథిక్స్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా కేవీపీపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News