: ఇంద్రాణి కేసు తప్ప ఇంకేమీ లేదా?: శివసేన


ప్రజాస్వామ్యంలో 'ఫోర్ట్ ఎస్టేట్'గా భావించే మీడియా ఎన్నో ప్రజా సమస్యలను వదిలేసి, షీనా బోరా హత్య కేసుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని శివసేన విమర్శలు గుప్పించింది. ఇంద్రాణి కేసు తప్ప మరేమీ మీడియాకు కనిపించడం లేదా? అని ఆ పార్టీ పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో అక్షింతలు వేసింది. ఇంద్రాణి హత్య ఎలా చేసింది? ఆమె జైల్లో ఏం చేస్తోంది? ఏం తింటోంది? వంటి విషయాలను ప్రజలకు అందిస్తూ, కీలకమైన కరవు పరిస్థితులు, సరిహద్దుల్లో ఉద్రిక్తత వంటి అంశాలను భారత మీడియా పక్కన పెట్టిందని దుయ్యబట్టింది. 1965 నాటి భారత్, పాక్ యుద్ధం 50వ వార్షికోత్సవం కన్నా, కూతురిని హత్య చేసిన తల్లి వార్తలను ప్రముఖంగా ప్రచురించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News