: మళ్లీ 11న రండి... జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. నేడు కోర్టులో జరగనున్న విచారణకు హాజరుకావాల్సి ఉన్నా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో నేడు జరిగిన విచారణకు జగన్ హాజరు కాలేదు. అయితే కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు. 11న నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జరగనున్న విచారణకు జగన్ హాజరుకానున్నారు.