: పవన్ కల్యాణ్ ను ఎక్స్ ట్రా ప్లేయర్ గా అభివర్ణించిన సీపీఐ నారాయణ
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్ లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. దీనికి తోడు, పరిశ్రమల పేరుతో పేదలకు ఇవ్వాల్సిన భూములను ప్రభుత్వం లాక్కోవడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని కరవు జిల్లాలను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరిగితే సీపీఐ పోరాటానికి దిగుతుందని చెప్పారు. కేంద్రాన్ని చూస్తే చంద్రబాబు, జగన్ లకు పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.