: పాతాళానికి స్టాక్స్... 52 వారాల కనిష్ఠానికి నిఫ్టీ


భారత స్టాక్ మార్కెట్ మరో భారీ పతనం దిశగా సాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయడం, అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వచ్చిన గణాంకాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలవైపే మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ కీలకమైన 7,700 పాయింట్ల వద్ద మద్దతును పొందలేకపోయింది. మధ్యాహ్నం 12:20 గంటల సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 491.78 పాయింట్లు పడిపోయి 1.91 శాతం నష్టంతో 25,273.00 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఒకదశలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 153 పాయింట్లు పడిపోయి 1.97 శాతం నష్టంతో 7,669 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీకి ఇది 52 వారాల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం. నిఫ్టీ-50లో 46 కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. మొత్తం 2,409 కంపెనీలు నేడు ట్రేడ్ కాగా, 1,968 కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News