: ఉపాధ్యాయుడిగా మారిన రాష్ట్రపతి ప్రణబ్... విద్యార్థులకు భారత రాజకీయ చరిత్ర బోధన
ఉపాధ్యాయుల దినోత్సవానికి ఒకరోజు ముందుగానే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడిగా మారారు. రాష్ట్రపతి భవన్ ఈరోజు పాఠశాలగా మారింది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయకు చెందిన 11, 12వ తరగతుల విద్యార్థులకు ఈరోజు భవన్ లో పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా భారత రాజకీయ చరిత్రను పాఠ్యాంశంగా తీసుకుని ఆయన బోధించారు. ఈ సందర్భంగా తాను విద్యార్థిగా ఉన్నప్పటి కొన్ని విషయాలను కూడా ప్రణబ్ వారికి వివరించారు.