: సూదిగాళ్లతో పొడిపిస్తారా? ఎలుకలతో కొరికిస్తారా?: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి


అసెంబ్లీలో ఏదైనా అడిగితే... మీ అంతు చూస్తాం, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. మా అంతు ఎలా తేలుస్తారో టీడీపీ నేతలు చెప్పాలని అన్నారు. గుంటూరు ఆసుపత్రిలో చేర్పించి ఎలుకలతో కొరికిస్తారా? ఎమ్మార్వో వనజాక్షిని కొట్టించినట్టు రౌడీలతో కొట్టిస్తారా? గోదావరి నీళ్లలో ముంచేస్తారా? ఏలూరు తీసుకెళ్లి సూదులతో పొడిపిస్తారా? లేదా నారాయణ కాలేజ్ లో చేర్పించి ర్యాగింగ్ చేయిస్తారా? అని ప్రశ్నించారు. మీరేం చేసినా మేం భయపడమని అన్నారు. ఓటుకు నోటు అంశాన్ని ప్రపంచం మొత్తం చూసిందని... ఈ అంశంపై చర్చిద్దామంటే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News