: బెజవాడ మెట్రోకు నిధుల కొరత లేదు... ‘మెట్రో’ శ్రీధరన్ తో చంద్రబాబు


విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధుల కొరత అన్న సమస్యే లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం మెట్రో రైలు నిర్మాణంలో ఆరితేరిన నిపుణుడు శ్రీధరన్ హైదరాబాదులో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. జైకా సంస్థ ఆర్థిక తోడ్పాటునందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్య ఉత్పన్నం కాదని చంద్రబాబు చెప్పారు. 2018 నాటికి మెట్రో పనులను పూర్తి చేయాలని శ్రీధరన్ కు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News