: వారిద్దరి ఉరితీత వెనుక రాజకీయ కారణాలు: ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా


పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు, 1993 నాటి బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరితీతల వెనుక రాజకీయ కారణాలున్నాయని ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ, మెమన్ విషయంలో జాలి చూపించేందుకు కొన్ని అవకాశాలున్నా వాటిని విస్మరించారని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసు విచారణ బెంచ్ కూడా మారిందని, మెర్సీ పిటిషన్ తిరస్కరించిన తరువాత ఉరితీతకు రెండు వారాల సమయం ఉండాలని, ఆ నిబంధన పాటించలేదని అన్నారు. ఈ కేసులో న్యాయ నిబంధనలను పాటించలేదని స్పష్టమవుతోందని వివరించారు. అఫ్జల్ కేసులో మెర్సీ పిటిషన్ ను దీర్ఘకాలం పాటు పెండింగులో ఉంచారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News