: సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం రూ.125, రూ.10ల నాణేల విడుదల చేసిన మోదీ
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.125, రూ.10ల నాణేలను విడుదల చేశారు. ఢిల్లీలోని మానెక్ షా ఆడిటోరియంలో ఈ రోజు గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నాణెంను విడుదల చేశారు. 9 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. మోదీ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదన్నారు. విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని చెప్పారు. గొప్ప వైద్యులైనా, శాస్త్రవేత్తలైనా వారి వెనుక గురువులు ఉంటారని ప్రధాని పేర్కొన్నారు. తల్లి జన్మనిస్తే... గురువు జీవితాన్ని ఇస్తాడన్నారు. అందుకే తనను ఉపాధ్యాయుడిగానే ప్రజలు గుర్తుంచుకోవాలని అబ్దుల్ కలాం అనేవారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.