: హయత్ నగర్ బాలికల హాస్టల్ లో ఆగంతుకుడు...భీతిల్లిన విద్యార్థినులు
హైదరాబాదు శివారు హయత్ నగర్ లో నిన్న రాత్రి ఓ ఆగంతుకుడు స్వైర విహారం చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా అక్కడి ఓ బాలికల హాస్టల్ లో అతడు చొరబడి నానా రభస చేశాడు. హాస్టల్ లోకి ప్రవేశించిన దుండగుడు అంతటితో ఆగకుండా బాలికలను నిద్ర లేపి కత్తి చూపించి దుస్తులు విప్పాలని హుకుం జారీ చేశాడు. అతడిని చూసిన వెంటనే తీవ్ర భయాందోళనలకు గురైన విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో ఆగంతుకుడు వచ్చిన దారిలో చిన్నగా జారుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థినుల ద్వారా సమాచారం అందుకున్న హాస్టల్ నిర్వాహకులు నేటి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.