: అవినీతిపై జగన్ మాట్లాడటం దశాబ్దంలోనే పెద్ద జోక్: మంత్రి పల్లె
ఓటుకు నోటు అంశంపై ఏపీ శాసనసభ దద్దరిల్లుతోంది. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబును వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి నిలదీయడాన్ని సభలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఖండించారు. అవినీతి మొత్తం పేటెంట్ జగన్ దేనని వ్యాఖ్యానించారు. అసలు అవినీతిపై జగన్ మాట్లాడటం ఈ దశాబ్దంలోనే పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. అంతేగాక ప్రపంచంలోని అవినీతిపరుల జాబితాలో జగన్ దే తొలిస్థానమని ఆయన విమర్శించారు. చరిత్రలో జగన్ ఓ ద్రోహిలా మిగిలిపోతారని పల్లె ఆరోపించారు.