: మన అధికారుల ఫోన్లు ట్యాపైతే నోరెందుకు విప్పలేదు?: జగన్ ను నిలదీసిన ధూళిపాళ్ల
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడుస్తూ మన రాష్ట్రానికి చెందిన అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తే నోరెందుకు విప్పలేదని ఆయన జగన్ ను నిలదీశారు. వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కాకుండా టీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులో సీమాంధ్రుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన సెక్షన్ 8 అమలుకు సంబంధించి చర్చ జరిగినప్పుడు జగన్ ఎక్కడికి పోయారని కూడా ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.