: రాజకీయాల్లోకి వస్తానంటున్న మైసూర్ మహారాజు


ఇటీవలే మైసూర్ మహారాజుగా పట్టాభిషిక్తుడైన యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ కు రాజకీయాలపైకి మనసు మళ్లింది. తనకు రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు. ప్రజాజీవితంలోకి వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశ్యం ఉందని తెలిపారు. అందుకే రాజకీయలోకి రావాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు మైసూర్ లోని కళామందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒడయార్ ఈ విధంగా మాట్లాడారు. అయితే తన రాజకీయ ప్రవేశంపై రాజమాత రాణి ప్రమోదదేవి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. ఈసారి నాడహబ్బ దసరాలో ప్రైవేట్ దర్బార్ లో తన తండ్రి స్థానంలో నిలుచుని సంప్రదాయ బద్ధంగా అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఒడయార్ తెలిపారు.

  • Loading...

More Telugu News