: వైకాపావి దగుల్బాజీ రాజకీయాలు: కాల్వ శ్రీనివాసులు


అనవసర ఆరోపణలతో దగుల్బాజీ రాజకీయాలు చేస్తూ, వైకాపా సభను తప్పుదారి పట్టిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన చార్జ్ షీటులో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిన అంశాన్ని చర్చించాలంటూ, వైకాపా వాయిదా తీర్మానం ఇవ్వగా, స్పీకర్ కోడెల దాన్ని తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో మాట్లాడిన కాల్వ శ్రీనివాసులు, ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదు కాబట్టి, ఇక్కడి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, కుట్రలు చేసి తమ నేతను కేసులో ఇరికిస్తే వారికి వైకాపా వంతపాడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి తోక పార్టీగా వైకాపా ఉందని దుయ్యబట్టారు. తమ నేత చంద్రబాబు నీతి, నిజాయతీలకు మారుపేరని, జగన్ లాగా కేసుల్లో ఇరుక్కుని జైలుకు పోలేదని అన్నారు. సభలో గందరగోళం చెలరేగుతుండగా, వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టిన వైకాపా, శాసనసభ సమావేశాలను పొడిగించాలని కూడా డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News