: కోడెల కూతురుపై కేసు నమోదు... కోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన నల్లపాడు పోలీసులు


టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూతురు పి.విజయలక్ష్మిపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మొబైల్ కోర్టు ఆదేశాల మేరకు విజయలక్ష్మి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకెళితే... నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల రోడ్డులోని తన భూమిని విజయలక్ష్మి మరో ఆరుగురితో కలిసి ఆక్రమించారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన శివలక్ష్మి ప్రత్యేక మొబైల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన మొబైల్ కోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయలక్ష్మి సహా మిగిలిన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News