: జగన్ కేసులో ‘జాబ్స్ అహెడ్.కామ్’ చీఫ్ కూ పాత్ర... నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై అటు సీబీఐతో పాటు, ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ముప్పేట దాడికి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే సీబీఐ కోర్టులో నమోదైన కేసులన్నింటినీ ఈడీ కోర్టుకు బదలాయించాలని ఆ దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. దాల్మియా గ్రూపు సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్త పునీత్ దాల్మియాను కూడా హైదరాబాదుకు రప్పించాలని తన పిటిషన్ లో ఈడీ కోర్టును కోరింది. గతంలో ‘జాబ్స్ అహెడ్.కామ్’ పేరిట ఈ- రిక్రూట్ మెంట్ పోర్టల్ ను ప్రారంభించిన ఆయన దానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. తదనంతర కాలంలో ఆ సైట్ ను ‘మాన్ స్టర్.కామ్’ కొనుగోలు చేసింది. తాజాగా జగన్ కేసులో పునీత్ దాల్మియాకు పాత్ర ఉందంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేయడంతో దాల్మియా కుటుంబంలో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News